పరమ్ సుందరి సినిమా విడుదల తర్వాత పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. కథ చాలా సులభంగా ఊహించగలిగేలా ఉంది. ఎమోషనల్ సీన్లు సహజంగా కాకుండా బలవంతంగా పెట్టినట్టుగా అనిపించాయి.
అయితే సినిమాకి కొన్ని మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి – సెట్స్, విజువల్స్ అందంగా ఉన్నాయి.
హీరో–హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది. మ్యూజిక్ లో కూడా కొన్ని మంచి పాటలు ఉన్నాయి.
మొత్తం మీద, రొమాన్స్ సినిమాను మళ్లీ బ్రతికించాలని చేసిన ప్రయత్నం పూర్తిగా సక్సెస్ కాలేదు. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారనే విషయం ఈ సినిమా చూపించింది.కథ పాత ఫార్ములా స్టైల్లో సాగుతుంది.
రొమాన్స్ సినిమాలను మళ్లీ ప్రేక్షకులకు దగ్గర చేయడానికి ప్రయత్నం చేసినా, ఈ చిత్రం పెద్దగా అనుభూతి కలిగించలేకపోయింది. సయ్యారా సినిమా విజయం వల్ల ప్రేమ కథలపై మళ్లీ ఆసక్తి పెరిగింది, కానీ పరమ్ సుందరి ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.