బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సినిమాల్లో మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత జీవితంపై చెప్పిన విషయాలతో కూడా అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తన కొత్త సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో, కుటుంబం, సంప్రదాయ భోజనం, ప్రశాంతమైన జీవితం గురించి , తిరుపతిలో స్థిరపడాలని తన కోరికను తెలిపింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాన్వీ, తనకు ముగ్గురు పిల్లలు కావాలని చెప్పారు. “నేను పెద్ద కుటుంబం కావాలని కోరుకుంటున్నాను, నా జీవితంలో ఆనందం, నవ్వులు నింపే ముగ్గురు పిల్లలు ఉండాలి” అని ఆమె చెప్పింది. “ధడక్”, “గుంజన్ సక్సేనా” వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ, తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా సంతృప్తి కావాలని ఆశపడుతోంది.
సాంప్రదాయ దక్షిణ భారత సంస్కృతి తనకు బాగా నచ్చుతుందని ఆమె చెప్పింది. కుటుంబంతో అరటిప ఆకుపై భోజనం చాలా అందమైన సంప్రదాయం అని చెప్పింది.
అలాగే, తిరుపతిలో ప్రశాంత జీవితం గడపాలని, పిల్లలను ఆలయానికి తీసుకెళ్లి సంప్రదాయ విలువలు నేర్పాలని ఆమె కలగంటోంది. సినీ రంగం హడావుడి జీవితం నుండి కొంత దూరంగా ప్రశాంత జీవితం గడపాలనేది ఆమె కోరిక.
వివాహం గురించి మాట్లాడుతూ, “సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను, తొందరపడను” అని జాన్వీ చెప్పింది.
తన కెరీర్‌కి, వ్యక్తిగత కలలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ, అభిమానులతో తన ఆలోచనలు పంచుకోవడం ద్వారా జాన్వీ మరింత దగ్గరవుతోంది.