నాని కొత్త అవతారం – "The Paradise"లో యాక్షన్ ఎంట్రీకి సిద్ధం -

నాని కొత్త అవతారం – “The Paradise”లో యాక్షన్ ఎంట్రీకి సిద్ధం

నాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా “The Paradise” కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ కొత్త లుక్‌లో కనిపించేందుకు రెడీ అయ్యాడు. 17 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నాని, ఈసారి పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ స్టైల్‌లో నటించబోతున్నాడు.

ఈ సినిమా కోసం నాని రోజూ గంటల తరబడి కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడని సమాచారం. జిమ్‌లో  వ్యాయామాలు, కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నాడు. నానికి దగ్గరగా ఉన్న వారు చెబుతున్నదాని ప్రకారం, ఆయన కేవలం బాడీ బిల్డింగ్ మాత్రమే కాకుండా మానసికంగా కూడా పాత్రకు సెట్ అవుతున్నాడట.

“The Paradise”లో నాని కొత్తగా కనిపించడ0 తో అభిమానుల్లో పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌కి సంబంధించిన ఫోటోలు, అప్‌డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఈ సినిమాలో ఆయన యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో నాని సరసన నటించబోయే ఇతర కాస్ట్ సభ్యుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. సినిమా కథ, ట్రీట్మెంట్ గురించి ఫిల్మ్ నగర్‌లో పెద్ద చర్చ నడుస్తోంది. నాని గతంలో ఎక్కువగా ఫ్యామిలీ, రొమాంటిక్, కామెడీ రోల్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ ఈసారి ఆయన ఫుల్ యాక్షన్ అవతారం చూసే ఛాన్స్ ఉంది.

సినిమా పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కుతోందని, విజువల్స్ కూడా హాలీవుడ్ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. టెక్నికల్ టీమ్, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా హై లెవెల్‌లో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, సినిమా ప్రమోషన్లు వేగం పెంచబోతున్నాయి. అభిమానులు “The Paradise” టీజర్, ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని పరిశ్రమలో ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *